పర్యావరణాన్ని కాపాడండి.. ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ విన్నపం

by Dishaweb |
పర్యావరణాన్ని కాపాడండి.. ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ విన్నపం
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందలో స్టార్ నటి రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్‌ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, అజయ్, సునీల్, జగదీష్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్ని ఒక మొక్క నాటాడు. అలాగే ‘పచ్చని చెట్లను పెంచి ప్రకృతిని, భూమిని, పర్యావరణాన్ని రక్షించాలి’ అంటూ తన అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ టీషర్ట్‌లో బన్నీ చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

రామ్ చరణ్, ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?



Next Story