- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లరి నరేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తోనే అభిమానుల్లో జోష్ పెంచిన మేకర్స్
అల్లరి నరేష్(Allari Naresh) తనదైన హాస్యంతో ఇండస్ట్రీలో కామెడీ కింగ్ అనిపించుకున్నాకు.

దిశ, సినిమా: అల్లరి నరేష్(Allari Naresh) తనదైన హాస్యంతో ఇండస్ట్రీలో కామెడీ కింగ్ అనిపించుకున్నాకు. కామెడీకే పరిమితం కాకుండా.. నవరసాలను పండిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా తనలోని మరో కోణాన్ని చూపిస్తూ విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ‘అల్కహాల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు అల్లరి నరేష్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో 65వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు చంద్రమోహన్ దర్శకత్వం వహించనున్నారు. ఈక్రమంలో.. తాజాగా, అల్లరి నరేష్ మరో సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ‘12ఎ రైల్వే కాలనీ’(12A Railway Colony) టైటిల్ రాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21న థియేటర్స్‌లో రానుంది.
ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం.. అల్లరి నరేష్ చుట్టూ డ్యాన్సర్లతో ఉత్సాహంగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. అలాగే ఓ వీడియోను షేర్ చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇప్పటికే నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాని కాసరగడ్డ (Nani Kasaragada)దర్శకుడిగా కాబోతుండగా.. పొలిమేర, పోలిమేర-2 చిత్రాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషలను కూడా అందించారు. ఇందులో అల్లరి నరేష్ సరసన కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇతర పాత్రలో వైవా హర్ష, సాయి కుమార్, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారీ, అనిల్ కురువిల్లా, మధుమణి నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.






