రాజకీయాల్లోకి రావడంపై అల్లరి నరేష్ క్లారిటీ

by Disha Web Desk 7 |
రాజకీయాల్లోకి రావడంపై అల్లరి నరేష్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కామెడీ స్టార్, హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేష్ నటనతో, కామెడీ టైమింగ్‌‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్‌పై ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తను రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ వార్తలపై అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చాడు.

అల్లరి నరేష్ హీరోగా.. ఏఆర్. మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ''ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం''. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''రాజకీయాలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్. రాజకీయాలు నాకు తెలియదు. రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సినిమాల్లో సక్సెస్ అయితే చాలు. అయితే డైరెక్టర్ అవుతా కానీ.. రాజకీయాల్లోకి మాత్రం రాను. అయిన నేను చాలా సెన్సిటివ్. సెన్సిటివ్‌గా ఉండే వాళ్లు రాజకీయాలకు పనిచేయరు'' అంటూ చెప్పుకొచ్చాడు. అల్లరి నరేష్ ఇచ్చిన క్లారిటీతో.. రాజకీయాల్లోకి నరేష్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ముగింపు పడింది.

'హరి హర వీరమల్లు' నుంచి బిగ్ అప్‌డేట్


Next Story