మా కుటుంబాన్ని విడదీయాలని చూసిన వారందరూ సర్వ నాశనం అయిపోతారు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మి

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

మా కుటుంబాన్ని విడదీయాలని చూసిన వారందరూ సర్వ నాశనం అయిపోతారు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మి
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్, విష్ణు(Vishnu)ల మధ్య గొడవ కావడంతో ఫ్యామిలీని తిసుకుని మోహన్‌బాబు(Mohan Babu) చిన్న కొడుకు మనోజ్ (Manoj)ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇక మంచు లక్ష్మి తమ్ముడికి సపోర్ట్‌గా ఉంటోంది. తమ్ముళ్లిద్దరు కొట్టుకున్నప్పటికీ సైలెంట్‌గానే ఉంది. మోహన్ బాబు, విష్ణులపై మనోజ్ కేసు కూడా పెట్టగా ఆ తర్వాత కాస్త గొడవలు సర్ధుమనగడంతో అంతా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నా కూతురు ఇంతకు ముందు విష్ణు వాల్ల స్కూల్‌లోనే చదివేది. ఆరు నెలలు వెళ్లాక సడెన్‌గా మాన్పించాను అప్పుడు ఇంట్లో గొడవ జరిగింది. అందరూ తనపై కేరింగ్ చూపించడమే కాకుండా సేవలు చేస్తున్నారు. ఇలాంటి లగ్జరీ లైఫ్ వద్దనే ఆ స్కూల్ మాన్పించి చిన్న స్కూల్‌కి పంపాను. ఇంట్లోవాళ్లు బాధపడినప్పటికీ తప్పలేదు. వాళ్ల కోసం నా కూతురి భవిష్యత్తును పాడు చేయలేను కదా. అలాగే కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను మనోజ్ ‘మిరాయ్’ ఈవెంట్లో మాట్లాడినా దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారు.

విష్ణు గురించి మాట్లాడకపోయినా.. తిట్టినట్లు చిత్రీకరించి థంబ్‌నైల్స్ పెట్టారు. అసలు ఒక కుటుంబాన్ని కలపాలనుకుంటున్నారా? విడదీయాలనుకుంటున్నారా? తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ నాశనం అవుతారు. మీ కర్మ మీరే అనుభవిస్తారనుకుంటున్నా’’ అని ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story