- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > మరో సౌత్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన అలియా.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
మరో సౌత్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన అలియా.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ మరో సౌత్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ మరో సౌత్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆమె తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు సూర్య హీరోగా దర్శకుడు శివ ఒకేసారి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ‘కంగువ’లో ఇప్పటికే బాలీవుడ్ నటులు దిశా పటానీ, బాడీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తాజాగా అలియా భట్ కూడా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సెకండ్ పార్టులో అలియా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుందని, మూవీ యూనిట్ ఆమెతో చర్చలు జరపగా తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుండగా అలియా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
- Tags
- alia bhatt
Next Story






