- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alia Bhatt: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆలియా.. ఇక నుంచి అలా చేయడం కష్టమంటూ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కమర్షియల్ సినిమాలే కాకుండా ‘గంగూబాయి కతియావాడి’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన నటనా సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులనే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా సొంతం చేసుకుని బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇక ఆల్ఫా(Alpha), లవ్ అండ్ వార్(Love and War) లాంటి భారీ ప్రాజెక్ట్స్‌తో మరోసారి తన రేంజ్ చూపించేందుకు సిద్ధమవుతోంది. షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆలియా, తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడింది. తల్లి అయ్యాక తన ఆలోచనా విధానమే మారిపోయిందని, ముఖ్యంగా కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పింది.
కీలక నిర్ణయం
బిడ్డకు సమయం కేటాయించాల్సి రావడంతో పనిలో వేగం తగ్గిందని అంగీకరించినా, ఆ మార్పు తనకు సంతోషాన్నే ఇచ్చిందని చెప్పడం విశేషం. అలాగే యాక్షన్ సినిమాలు చేయడం గురించి మాట్లాడుతూ.. ఒక మహిళ తల్లి అయిన తర్వాత ఫిజికల్‌గా యాక్షన్ సీన్స్ చేయడం చాలా కష్టమని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, బిడ్డ పుట్టిన తర్వాత అవి చేయడం తనకు చాలెంజింగ్‌గా మారిందని పేర్కొంది. ఈ దశలో తన శరీర సామర్థ్యం, హద్దులు ఏంటో ఇప్పుడు అర్థమవుతోందని చెప్పింది. అందుకే ఇక నుంచి ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయకుండా, ఒక్క సినిమా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నానని ఆలియా స్పష్టం చేసింది. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. స్టార్ హీరోయిన్ అయినా కూడా, తల్లిగా తన బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్న ఆలియా భట్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






