‘ఆల్కహాల్’ టీజర్ అప్డేట్.. మీ కోసం కొత్త ఉన్నత శిఖరం వేచి ఉందంటూ హైప్ పెంచేసిన మేకర్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా, కమెడియన్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

‘ఆల్కహాల్’ టీజర్ అప్డేట్.. మీ కోసం కొత్త ఉన్నత శిఖరం వేచి ఉందంటూ హైప్ పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా, కమెడియన్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించిన ఆయన మంచి గుర్తింపుతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. గత ఏడాది ‘బచ్చల మల్లి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం కొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఆల్కహాల్’ (Alcohol)ఒకటి. మెహర్ తేజ్ (Mehar Tej)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కొత్త బ్యూటీ నిహారిక(Niharika) ఎన్ఎమ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అల్లరి నరేష్ కెరీర్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్‌కు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ‘ఆల్కహాల్’చిత్రబృందం టీజర్ అప్డేట్ ఇస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ అంచనాలను పెంచారు. త్వరలోనే హిట్ కొట్టేందుకు అల్లరి నరేష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ కొత్త ఉన్నత శిఖరం వేచి ఉందంటూ ‘ఆల్కహాల్’ టీజర్ సెప్టెంబర్ 4న రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే సూటు ధరించిన అల్లరి నరేష్ ఏదో ఆసక్తిగా చూస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

link

Next Story