రాధేశ్యామ్‌తో ఢీ కొట్టనున్న బాలీవుడ్ స్టార్ హీరో..?

by Web Desk |
రాధేశ్యామ్‌తో ఢీ కొట్టనున్న బాలీవుడ్ స్టార్ హీరో..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ రాధేశ్యామ్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని రోజులు లెక్కేసుకుంటున్నారు. అయితే కరోనా మహిమ కారణంగా సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను మార్చి 18కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే 'రాధేశ్యామ్‌'ను ఢీ కొట్టేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు.

అతడెవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అక్షయ్ తన అప్‌కమింగ్ మూవీ 'బచ్చన్ పాండే' సినిమాను కూడా మార్చి 18న రిలీజ్‌ చేసేందుకు సిద్ధం చేస్తున్నాడట. దీంతో రాధేశ్యామ్ vs బచ్చన్ పాండే హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తల పడతాయా, లేకుంటే ఎవరైనా వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి.

Next Story

Most Viewed