Akshay Kumar: పరేష్ రావల్‌తో వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. వైరల్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-15 12:53:23  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కల్ట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘హేరా ఫేరి-3’(Hera Pheri-3) మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

Akshay Kumar: పరేష్ రావల్‌తో వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కల్ట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘హేరా ఫేరి-3’(Hera Pheri-3) మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు పార్ట్స్‌లో నటించిన పరేష్ రావల్ తప్పుకున్నట్లు ప్రకటించడంతో.. అక్షయ్ కుమార్ 25 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పరేష్ రావల్‌(Paresh Rawal)కు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఒక రోజు షూటింగ్‌లో కూడా పాల్గొని సడెన్‌గా సినిమాను మధ్యలో వదిలేయడం వల్ల నష్టం వాటిల్లిందని నిర్మాణ సంస్థ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇక ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా సహనటులలో ఒకరి కోసం మూర్ఖత్వం లాంటి పదాలు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. ఆయనతో నేను 30-32 సంవత్సరాలకు కలిసి పని చేశాను. మేము మంచి స్నేహితులం. ఆయన చాలా గొప్ప నటుడు. నేను అతన్ని ఎంతగానో అభినందిస్తాను. ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం కాదు. ఈ విషయం కోర్ట్ చూసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక వివాదం జరగడంపై ప్రేక్షకుల్లో అయోమయం ఏర్పడింది. అంత పొగిడిన వ్యక్తం నోటీసులు ఎందుకు పంపాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

Next Story