తాత కాబోతున్న అక్కినేని నాగార్జున.. అసలు విషయాలు రివీల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) త్వరలో తాత కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

తాత కాబోతున్న అక్కినేని నాగార్జున.. అసలు విషయాలు రివీల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) త్వరలో తాత కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala)తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అఖిల్, జైనబ్ కూడా తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఈ రెండు జంటలు మాత్రం స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు తాత కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి? అది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేను అధికారిక ప్రకటన విడుదల చేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా కొత్త ఏడాది అక్కినేని ఇంట్లో వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో నాగార్జున తన ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘నేను గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేక ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా లూబ్రికెంట్, ఫ్లూయిడ్స్, పీఆర్‌పీ చికిత్స తీసుకుంటున్నాను. నొప్పి ఉన్నా లేకపోయినా డైలీ ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. అది అస్సలు మిస్ చేయను’’ అని అన్నారు. 66 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్న నాగార్జున ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకున్న వారు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ నాగ్ ప్రేక్షకులను అలరించడంలో ముందుంటున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story