ఇండస్ట్రీలో ఆ పని కోసం తన పలుకుబడిని ఉపయోగించుకుంటున్న నాగార్జున

by Disha Web Desk |
ఇండస్ట్రీలో ఆ పని కోసం తన పలుకుబడిని ఉపయోగించుకుంటున్న నాగార్జున
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి సుపరిచితమే. అక్కినేని నాగేశ్వరరావు సినిమాలంటే ఒక రేంజ్‌లో ఉండేవి. అంతేకాకుండా నాగేశ్వరరావు తన నటనతో అందరి హృదయాలను దోచుకుని, మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆయన వారసుడిగా ఏంట్రీ ఇచ్చిన నాగార్జున కూడా అంతే మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాడు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. ముఖ్యంగా ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

కాగా, ఇటీవల నాగార్జున ఒకప్పుడు పోస్ట్ చేసిన వార్త ప్రజెంట్ వైరల్ అవుతోంది. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ గురించి నాగార్జున మాట్లాడుతూ అక్కినేని వారసులు సొంత కష్టంతో పైకి రావాలని, దానికి వారు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన పూర్తిగా అపజయాలను మూటగట్టుకున్న తన రెండో కుమారుడు అఖిల్ కోసం తన పలుకుబడిని ఉపయోగిస్తున్నాడట. ప్లాప్ హీరోగా ముద్రపడిన అఖిల్‌ను ఇండస్ట్రీలో బిజీ చేసేందుకు గతంలో ఆయన చెప్పిన ‘స్వయం కృషి’ మాటను పక్కనబెట్టి ఆఫర్లు ఇప్పించేందుకు దర్శకులు, నిర్మాతలకు గాలం వేస్తున్నారట. అఖిల్‌ చేత ఒక్క హిట్ అయినా కొట్టించాలని నాగార్జున విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా అఖిల్ సక్సెస్ అవుతాడో లేదో వేచిచూడాలి.

Next Story