అక్కినేని అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ డేట్ లాక్.. ఆ స్పెషల్ డే నాడే అయ్యగారి రాక ఫిక్స్!

by Mallepaka Hamsa |

అక్కినేని అఖిల్ (Akkineni Akhil)హీరోగా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులే అవుతున్నప్పటికీ పెద్దగా హిట్స్ మాత్రం అందుకోలేదు.

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ డేట్ లాక్.. ఆ స్పెషల్ డే నాడే అయ్యగారి రాక ఫిక్స్!
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ (Akkineni Akhil)హీరోగా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులే అవుతున్నప్పటికీ పెద్దగా హిట్స్ మాత్రం అందుకోలేదు. ‘అఖిల్’ చిత్రంతో వచ్చిన ఆయన పలు మూవీస్ చేసినప్పటికీ పేరు ప్రఖ్యాతలను మాత్రం అందుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా ‘ఏజెంట్’ అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ ‘లెనిన్’ (Lenin)చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మురళీకృష్ణ అబ్బూరు (Muralikrishna Abburu)దర్శకత్వంలో రాయలసీమ బ్యాగ్ డ్యాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ముందుగా.. హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. కొన్ని సీన్లు కూడా షూట్ చేసిన మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ కూడా షేర్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా నుంచి శ్రీలలు తొలగించారని తెలుస్తోంది.

అంతేకాకుండా పలు సీన్స్‌ను రీషూట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల స్థానంలోకి భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసుకున్నట్లు టాక్. తాజా.. సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన రీ షూటింగ్‌తో పాటు.. దాదాపు షూట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ షూట్‌లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ చివరి వరకు షూట్ పూర్తి చేసి జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో రాబోతున్న ‘లెనిన్’ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇక ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు పోటీగా ‘స్వయంభు’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వాలెంటైన్స్ డేకి అఖిల్, నిఖిల్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ‘స్వయంభు’ సినిమాలో సంయుక్త మీనన్, నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో ప్రారంభించినప్పటికీ పలు కారణాల వల్ల ఇన్నాళ్లు విడుదల కాలేదు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరిలో రాబోతుందని నిఖిల్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story