అయ్యగారి రాకకు రంగం సిద్ధం.. అక్కినేని అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |

అక్కినేని అఖిల్(Akkineni Akhil) చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘లెనిన్’ (Lenin)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయ్యగారి రాకకు రంగం సిద్ధం.. అక్కినేని అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘లెనిన్’ (Lenin)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యం విష్ణు కదా’ ఫేమ్ మురళీ కిషోర్(Murali Kishore) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘లెనిన్’ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో అఖిల్ సరసన శ్రీలీల నటించనుండగా.. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి కాగా.. ఆమె డేట్స్ ఇవ్వడంలో లేట్ చేస్తుండటంతో తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సేను తీసుకుని పలు సీన్స్ రీషూట్ కూడా చేసినట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి కాగా.. త్వరలోనే చివరి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల్లో హైప్ పెంచేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాగైనా పూర్తి చేసి నవంబర్ 17న ‘లెనిన్’ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు సంతోషపడుతున్నారు.

Next Story