నాగార్జునను అలా అనేసిన అక్కినేని కొత్త కోడలు.. పోస్ట్ చూసి జైనబ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘కుబేర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

నాగార్జునను అలా అనేసిన అక్కినేని కొత్త కోడలు.. పోస్ట్ చూసి జైనబ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘కుబేర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘కూలీ’లో విలన్‌గా నటించిన ఆయన ప్రశంసలు అందుకున్నారు. యాక్టింగ్ సూపర్‌గా ఉందంటూ ఇలా చేస్తారని ఊహించలేదన అన్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్-100 టైటిల్ పెట్టబోతున్నట్లు టాక్. స్క్రిప్ట్ వర్క్ పనులు నడుస్తుండగా.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు నాడు ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావించారు.

కానీ అక్కినేని అభిమానులకు నిరాశనే మిగిలింది. ఇదిలా ఉంటే.. నాగార్జున పుట్టినరోజు నాడు విషెస్ తెలుపుతూ అఖిల్‌(Akkineni Akhil) భార్య ఓ పోస్ట్ పెట్టి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. జైనబ్(Zainab) తన మామతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున గారు. మీరు ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిస్తారు. మీరు మా తండ్రిగా ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మామ అవుతడు కానీ తండ్రి అంటావేంటి అని ఆశ్చర్యపోతున్నారు. తండ్రి లాంటి వారు అనడం వేరు తండ్రి అనడం వేరు అర్థం తెలుసుకోమంటూ నెటిజన్లు జైనబ్‌ను ఆడుకుంటున్నారు.

ఇక అక్కినేని అభిమానులు మాత్రం అలా అనడంలో తప్పేముందని జైనబ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాగా, అక్కినేని అఖిల్, జైనబ్ నిశ్చితార్థం సీక్రెట్‌గా కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసి నాగార్జున ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరి పెళ్లి సింపుల్‌గా చేశారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం అఖిల్ పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయకుండా ‘లెనిన్’ మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

link

Next Story