రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటోన్న రేణుదేశాయ్.. తల్లిపై అకీరా నందన్ షాకింగ్ కామెంట్స్?

by Disha Web Desk 9 |
రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటోన్న రేణుదేశాయ్.. తల్లిపై అకీరా నందన్ షాకింగ్ కామెంట్స్?
X

దిశ, సినిమా: కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, మోడల్ గా హీరోయిన్ గా.. టాలీవుడ్ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రేణు దేశాయ్ రెండో సినిమా జానీ లో కూడా పవన్ తోనే జతకట్టింది. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుని అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. కొన్నేళ్ల తర్వాత పలు కారణాల వల్ల పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ విడిపోయారు. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమైన రేణు రీసెంట్ గా తెరకెక్కిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో హాజరైన రేణుదేశాయ్ కు రెండో పెళ్లిపై ప్రశ్నలెదురవ్వగా..

‘నా రెండో పెళ్లి చేయాలని మా పేరెంట్స్ సంబంధాలు కూడా చూశారు. నేను కూడా ఎలాంటి వాడు వస్తాడో కలలు కన్నాను. ఒకరితో మాట్లాడాను కానీ వర్కౌట్ కాలేదు. కానీ నేను రెండో పెళ్లి చేసుకుంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చంపేస్తానని బెదిరింపు పోస్టులు పెట్టారు. పవన్ మరో వివాహం చేసుకుంటే ప్రశ్నించని వాళ్లు.. నా విషయంలో ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పడు అవేమి పట్టించుకోను.

నా పిల్లలు కూడా నన్ను అడిగారు. నాన్న మరో వివాహం చేసుకున్నప్పుడు, నువ్వు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు అమ్మ. పెళ్లి చేసుకోమని అకీరా అన్నాడు. చేసుకుంటా నాన్న.. మనకు కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా? అని చెప్పాను. కానీ నా పిల్లలు వాళ్ల నాన్నతో ఎందుకు విడిపోయాని ఎప్పుడు అడగరు. ఒకవేళ నేను కనుక వివాహం చేసుకుంటే గర్వంగా అందరికి చెబుతాను’’ అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గతంలో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పలువురు జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read More..

ఆయనే నా ఫస్ట్ లవ్.. ఒక్క రోజు మీ భర్తను నాకు ఇస్తారా.. ఫ్యాన్ కోరికకు జ్యోతిక రియాక్షన్ ఇదే


Next Story