- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అఖండ 2’ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూస్తారు..
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ-2’(Akhanda-2).

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ-2’(Akhanda-2). రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘‘అఖండకి మించిన అంచనాలు ‘అఖండ 2’ పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి గారు కూడా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ గారు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్‌ను చాలా కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది’’ అని అన్నారు.






