‘అఖండ-2’ సెకండ్ సింగిల్ అప్డేట్.. మాస్ పోస్టర్ విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

గాడ్ ఆఫ్ ది మాసెస్ బాలయ్య (Balakrishna)అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2).

‘అఖండ-2’ సెకండ్ సింగిల్ అప్డేట్.. మాస్ పోస్టర్ విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ ది మాసెస్ బాలయ్య (Balakrishna)అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘అఖండ-2’(Akhanda-2). బోయపాటి శ్రీను(Boyapati Srinu) పవర్ ఫుల్ కొలాబరేషన్‌తో డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజాగా రాబోతుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.హర్షల్ మల్హోత్రా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. అఖండకు సీక్వెల్‌గా రాబోతున్న ‘అఖండ-2తాండవం’లో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో హైప్ పెంచుతున్నారు.

ఇటీవల ఈ సినిమా 3Dలో రాబోతున్నట్లు డైరెక్టర్ అధికారికంగా ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇక ఇప్పుడు ‘అఖండ-2’ నుంచి మరో అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ వస్తున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. ‘‘జాజికాయ.. జాజికాయ’’ అని సాగే ఈ పాటను వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో ఓ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ లిరికల్ వీడియో నవంబర్ 18న రాబోతున్నట్లు తెలుపుతూ.. బాలయ్య బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మీసాలపై వేలు పెట్టుకుని స్లైలీష్‌గా నిలబడి ఉండగా.. సంయుక్తా మీనన్ గోల్డ్ కలర్ డ్రెస్‌తో మెరిసిపోతుంది. ఈ మాస్ పోస్టర్ చూసిన నెటిజన్లు ఇక సంయుక్తకు దబిడి దిబిడే అని కామెంట్లు పెడుతున్నారు.

link

Next Story