‘ఆశికీ 3’లోకి బోల్డ్ బ్యూటీ.. కత్రిన, దీపికలను రిజెక్ట్ చేసిన మేకర్స్!

by Disha Web Desk |
‘ఆశికీ 3’లోకి బోల్డ్ బ్యూటీ.. కత్రిన, దీపికలను రిజెక్ట్ చేసిన మేకర్స్!
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ సూపర్ హిట్ ప్రాజెక్ట్ ‘ఆశికీ’ ఫ్రాంఛైజీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. 2013లో వచ్చిన ‘ఆశికీ 2’కు సీక్వెల్‌ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ‘ఆశికీ 3’లో కార్తిక్‌క్ జోడిగా ఆకాంక్షను ఫేనల్ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎవరినీ తీసుకోవాలనే అనేకసార్లు చర్చలు జరిపిన మేకర్స్.. మొదట కత్రినా కైఫ్, దీపిక పదుకొణె వంటి స్టార్ హీరోలను పరిశీలించినప్పటికీ చివరగా ఆకాంక్షకే మొగ్గుచూపుతున్నారట. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే ఆకాంక్షతో రెండు మూడుసార్లు మూవీ గురించి డిష్కస్ చేశారని, రొమాంటిక్ స్టోరీతో ఆమెను బాలీవుడ్‌తోపాటు సినీ ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కన్నడలో పలు సినిమాలు చేసిన ఆమె టైగర్ ష్రాఫ్‌తో ‘డిస్కో 82’ అనే మ్యూజిక్ వీడియోలో నటించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Read More: 30 ఏళ్ల కెరీర్ లో రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Next Story

Most Viewed