ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్న అజయ్ దేవ్‌గణ్.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో టీమ్

by Mallepaka Hamsa |

ఒక పోరాట యోధుడి కథతో అజయ్ దేవ్‌గణ్, ఓం రౌత్ కలిసి పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.

ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్న అజయ్ దేవ్‌గణ్.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో టీమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ 'తానాజీ ది అన్‌సంగ్ వారియర్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న ఓం రౌత్‌కు, వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అజయ్ దేవ్‌గణ్ మళ్ళీ అవకాశం ఇచ్చారనే వార్త బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే, ఈ వార్తలపై అజయ్ దేవ్‌గణ్ అధికారిక బృందం తాజాగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని తేల్చి చెప్పింది. ‘‘ఒక పోరాట యోధుడి కథతో అజయ్ దేవ్‌గణ్, ఓం రౌత్ కలిసి పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.

ఆ దర్శకుడితో ఎలాంటి చర్చలు జరగలేదు. ప్రస్తుతం అజయ్ తన తదుపరి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు మా అధికారిక టీమ్‌ను సంప్రదించాలి’’ అని అజయ్ టీమ్ స్పష్టం చేసింది. నిజానికి ‘తానాజీ’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మేకింగ్‌తో విమర్శలు ఎదుర్కోవడంతో అజయ్ అభిమానులు ఈ కొత్త సినిమా వార్తపై కాస్త ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు అజయ్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లన్నీ చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ దృష్టి అంతా తన చేతిలో ఉన్నదృశ్యం 3 (Drishyam 3), ధమాల్ 4 (Dhamaal 4), గోల్మాల్ 5 సినిమాలపైనే ఉంది.

Next Story