- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో ఐశ్వర్య విడాకులు.. క్లారిటీ ఇస్తూ స్టేట్మెంట్ రిలీజ్.. నేను వీక్ కాదంటూ..
హిందీ సీరియల్ నటి ఐశ్వర్యా శర్మ.. భర్త నీల్ భట్‌తో కలిసి బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆ తర్వాత మరింత ఫేమ్ సంపాదించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరు విడిపోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దూరంగా ఉంటున్నారని.. విడాకులు కన్ఫర్మ్ అయినట్లేననే వార్తలను స్ప్రెడ్

దిశ, వెబ్‌డెస్క్ : హిందీ సీరియల్ నటి ఐశ్వర్యా శర్మ.. భర్త నీల్ భట్‌తో కలిసి బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆ తర్వాత మరింత ఫేమ్ సంపాదించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరు విడిపోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దూరంగా ఉంటున్నారని.. విడాకులు కన్ఫర్మ్ అయినట్లేననే వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే ఈ న్యూస్ విని విసిగిపోయిన ఐశ్వర్య.. రూమర్స్‌కు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చింది. బేస్ లెస్‌గా ఇలాంటి ప్రచారం చేయడంపై ఫైర్ అయింది.
‘నేను చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నా. దీనర్థం నేను వీక్ అని కాదు నా ప్రశాంతతను కాపాడుకోవాలని. కానీ నేను ఎప్పుడూ చెప్పని విషయాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు. నిజానిజాలు తెలియకుండా మీ పబ్లిసిటీ కోసం నన్ను వాడుకోవడం చాలా బాధను కలిగించింది. నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ విషయంపై ఎలాంటి ఇంటర్వ్యూ,స్టేట్మెంట్, రికార్డింగ్స్ ఇవ్వలేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే చూపించండి.. లేదంటే నా పేరు మీద ఈ ప్రచారాన్ని మానుకోండి. నా లైఫ్ మీ కంటెంట్ కాదు.. నా సైలెన్స్ మీకు పర్మిషన్ కాదు.. ఒకరు నిశ్శబ్దంగా ఉన్నారంటే వారు చెప్పేందుకు ఏమీ లేదని కాదు.. డిగ్నిటీ కోరుకుంటున్నారని అర్థం’ అని పెద్ద నోట్ రాసుకొచ్చింది.






