లక్కీ చాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. హిట్ డైరెక్టర్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా!

by Mallepaka Hamsa |

భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇండస్ట్రీలో రాణిస్తోంది.

లక్కీ చాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. హిట్ డైరెక్టర్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా!
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇండస్ట్రీలో రాణిస్తోంది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ తెలుగులో పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో పాటు లేడీ ఓరియంటెడ్ కథల్లోనూ నటించి మెప్పించింది. ఇక ఇటీవల తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సూపర్ హిట్ సాధించడంతో పాటు చెరగని ముద్ర వేసుకుంది. అయినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో అవకాశం దక్కించుకోలేకపోయింది. కొన్ని తమిళ చిత్రాలకు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య రాజేష్ ఓ లక్కీ చాన్స్ దక్కించుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు ఓ లక్కీ చాన్స్ దక్కించుకున్నట్లు టాక్. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రాబోతుండగా... హారర్ మూవీ ‘మసూద’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి కిరణ్(Sai Kiran) దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కూడా ఈ విజయం తర్వాత ఎలాంటి అవకాశం రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్‌కి ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాకపోవడంతో ఇది లక్కీ చాన్స్ అని అంతా అంటున్నారు. అలాగే దర్శకుడు సాయి, నిర్మాత మహేశ్వర్ రెడ్డికి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేదు. అలాంటి ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Next Story