- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Abhishek Bachchan: రెండో సంతానంపై ఐశ్వర్యరాయ్ భర్తకు ఎదురైన ప్రశ్న..?
తరచూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచే సెలబ్రిటీల్లో ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) అండ్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచే సెలబ్రిటీల్లో ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) అండ్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒకరు. మొన్నటి వరకు ఈ జంట గురించి నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. పలు కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ రీసెంట్‌గా ఐశ్వర్య-అభిషేక్ ఓ ఫంక్షన్‌లో దిగిన ఫొటో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా.. ఈ రూమర్లకు చెక్ పడింది. ఇదంతా పక్కన పెడితే.. రితేశ్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh) యాంకర్‌గా చేస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘కేస్ తో జనతా హై’(KES THO JANATHA HAI) కార్యక్రమానికి హాజరయ్యారు అభిషేక్ బచ్చన్. ఈ టాక్ షోలో ఐశ్వర్య భర్తను రెండో సంతానం గురించి ప్రశ్నించారు. ఆరాధ్య తర్వాత ఏంటి..? అని నటుడు రితేష్ అడిగాడు. దీనికి అభిషేక్ బదులిస్తూ.. నేను మీకంటే పెద్దవాడిని ఇలాంటి క్వశ్చన్స్ అందరి ముందు అడగటం సరైన పద్ధతి కాదని వెల్లడించారు. కానీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan).. ఇలా నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఫ్యామిలీలోనే సంప్రదాయంగా వస్తోందని తెలిపారు.






