వీధుల్లో వేధింపులపై స్పందించిన ఐశ్వర్య రాయ్ .. నా శరీరం నా ఇష్టం అంటూ ఫైర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

వీధుల్లో వేధింపులపై స్పందించిన ఐశ్వర్య రాయ్ .. నా శరీరం నా ఇష్టం అంటూ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ లోరియల్ పారిస్ స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య మహిళపై చేస్తున్న వేధింపుల గురించి మాట్లాడింది. వీధుల్లో వేధింపులను మీరు ఎలా ఎదుర్కొంటారు అని యాంకర్ ప్రశ్నించగా..‘‘కళ్లలోకి చూడకుండా ఉండొద్దు. నేరుగా కళ్ళలోకి చూడండి. మీ తల ఎత్తుకొని తిరగండి. ఫెమినైన్, ఫెమినిస్ట్. నా శరీరం, నా విలువ. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మీపై మీరు సందేహపడొద్దు. మీ విలువ కోసం నిలబడండి.

మీ దుస్తులు లేదా మీ లిప్‌స్టిక్‌ తప్పు కాదు. వీధుల్లో వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదు’’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. యువతులకు, మహిళలందరికీ ఇది శక్తివంతమైన సందేశం అని అభిప్రాయపడుతున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ చివరగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక యాక్షన్ డ్రామా ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో కనిపించింది. విక్రమ్, రవి మోహన్, కార్తీ, త్రిష కృష్ణన్ వంటి నటులు కూడా నటించిన మంచి హిట్ అందుకుంది. అయినప్పటికీ ఐశ్వర్య మాత్రం ఇండస్ట్రీకి మొత్తానికి దూరం అయింది.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఇటీవల విడాకులు తీసుకున్నట్లు పలు పుకార్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమ కూతురు ఆరాధ్యను మాత్రం ఐశ్వర్య తన దగ్గరే ఉంచుకున్నట్లు టాక్. పలు మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఐశ్వర్య మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓ ఈవెంట్‌కు తన భర్త అభిషేక్ బచ్చన్‌తో వెల్లడంతో.. విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేలా లేదని చెప్పాలి. ఇంటి బాధ్యతలతో ఫుల్ బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story