- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆందోళనగా ఉందంటూ కీలక విజ్ఞప్తి చేసిన ఐశ్వర్య.. దయచేసి అలా చేయొద్దంటూ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గత రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గత రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చివరగా.. ఈ స్టార్ బ్యూటీ ‘పొన్నియన్ సెల్వన్-2’ (Ponniyin Selvan: II)సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత నుంచి ఐశ్వర్య సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. తాజాగా, ఓ యాడ్ చేసిన ఐషు యూత్‌కు కీలక విజ్ఞప్తి చేసింది. ‘‘నేటితరం సోషల్ మీడియాలో లీనమైపోతున్నారు. అందులో ఏదైనా పోస్ట్ పెడితే వచ్చే లైక్స్, కామెంట్స్ చూసి అదే జీవితం అని అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయాన్ని గమనించలేకపోతున్నారు.. అందులో వచ్చేవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు.
మనం మనలా ఉంటేనే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. అలాగే మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. వారికి సాధ్యం కూడా కాదు. మీకు కావాల్సి ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్‌లో కాకుండా నిజ జీవితంలో వెతకండి. ఒక్కసారి దానిని దాటి ముందుు రండి మీకు దక్కాల్సిన గౌరవం పొందుతారు. సోషల్ మీడియా విషయంలో ఒక తల్లిగా, మహిళగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాకు బానిసలు అవుతూ.. పక్కన ఉన్నవారిని పట్టించుకోవడం లేదు. కొందరు దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దయచేసి సోషల్ మీడియా నుంచి బయటపడండి. అసలైన ప్రపంచాన్ని చూసేందుకు ప్రయత్నించండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ యూత్ కల్లుతెరిచేలా చేశాయి. ఇక ఆమెకు సపోర్ట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.






