‘ఓజీ’ నటుడితో ప్రేమలో పడిన మెగా బ్యూటీ .. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారా?

by Mallepaka Hamsa |

మలయాళ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘జందుకలుండే నత్తిల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

‘ఓజీ’ నటుడితో ప్రేమలో పడిన మెగా బ్యూటీ .. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారా?
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘జందుకలుండే నత్తిల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇటీవల ‘మామన్’ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’(sambarala yetigattu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మెగా హీరో సాయి ధరత్ తేజ్(Sai Dharam Tej) హీరోగా నటిస్తుండగా.. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైజ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య లక్ష్మికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ అమ్మడు ‘ఓజీ’ మూవీలో నటిస్తున్న అర్జున్ దాస్‌తో ప్రేమలో పడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో వీరిద్దరు ఓ వెబ్ సిరీస్ కోసం పని చేస్తుండగా.. ప్రేమించుకుంటున్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు జోరందుకున్నాయి.

ఈ క్రమంలో వారు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లకు చెక్ పడలేదు. ఇప్పుడు మళ్లీ ఐశ్వర్య, అర్జున్ ప్రేమ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిప్పు లేనిదే పొగ రాదంటూ వారి ప్రేమ నిజమే అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతుందని సంబర పడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story