- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనీత్ పద్దాతో రిలేషన్‌షిప్‌పై స్పందించిన అహాన్ పాండే.. ఆ బంధం ఎప్పటికీ ఉంటుందంటూ కామెంట్స్
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయుడు అహాన్ పాండే(Ahan Pandey) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయుడు అహాన్ పాండే(Ahan Pandey) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘సైయారా’ సినిమాతో హీరోగా మారిన ఆయన మొదటి ప్రాజెక్ట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు ఊహించని క్రేజ్‌ను రాబట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో నటించిన అహాన్ పాండే సరసన నటించిన అనీత్ పద్దా(Aneeth Padda)కు కూడా బాగానే పాపులారిటీ దక్కింది. వీరిద్దరికీ ఇది మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ కెమిస్ట్రీ అదిరిపోయిందనే ప్రశంసలు పొందారు. అలాగే ఈ మూవీ భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. అయితే అహాన్ పాండే, అనీత్ పద్దా ఈ సినిమాలో నటించిన తర్వాత నుంచి ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పలు చోట్లకు జంటగా వెళ్లడంతో పుకార్లకు బలం చేకూరినట్లు అయింది.
తాజాగా, ఈ విషయంపై అహాన్ పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘అనీత్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇంటర్నెట్ అంతా మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కెమిస్ట్రీ ఎల్లప్పుడూ రొమాంటిక్ కాదు - ఇది సౌకర్యం, భద్రత మరియు చూడటం గురించి. మేమిద్దరం ఒకరినొకరు అలా భావించేలా చేసుకున్నాము. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ కాకపోయినా, నాకు అనీత్‌తో ఉన్న బంధం ఎప్పటికీ ఉంటుంది. ప్రస్తుతం నేను రిలేషన్‌లో లేను.. నేను సింగిల్‌గా ఉన్నాను.
నేను మొదట అనీత్‌ను మోహిత్ సర్ ఆఫీసులో కలిశాను. ఇంతకుముందు ఆమె నాకు తెలియదు. ఒకరోజు షూట్‌లో ఉండగా.. అనీత్ లేట్‌గా పసుపు కలర్ డ్రెస్‌లో వచ్చింది. అయితే మోహిత్ సూరికి షూట్‌కు లేట్ రావడం అంతగా నచ్చదు. ఎక్కడ ఆమెను చూస్తాడో అని నేను ఆయనను డైవర్ట్ చేయడానికి గిటార్ వాయించడంతో పాటు భయంకరంగా పాడటం మొదలుపెట్టాను. అనీత్ తెలివిగా ప్రవర్తించి మోహిత్ కోపం నుంచి బయటపడింది. అలా మా స్నేహం మొదలైంది’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.






