‘ఏజెంట్’ అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంది: నిర్మాత

by Disha Web Desk 17 |
‘ఏజెంట్’ అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంది: నిర్మాత
X

దిశ, సినిమా: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల కాంబోలో వస్తున్న ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై సినిమాను నిర్మించిన రామబ్రహ్మం సుంకర మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘ఇది చాలా పెద్ద సినిమా. నిజాయితీగా చెప్పాలంటే మాపై ఒత్తిడి ఉంది. ‘ఏజెంట్’ అందరికీ నచ్చే కంటెంట్. నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా మొదలుపెట్టినప్పుడే పెద్ద సవాల్ తీసుకుంటున్నామని అర్థమైంది. దీంతో ఒక లక్ష్యంతో ముందుకెళ్లాం. మూవీ విడుదలైన తర్వాత అఖిల్ స్పాన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కథ భిన్నంగా ఉంటుంది. ఎమోషన్స్ బలంగా ఉంటాయి. అఖిల్‌కు బిఫోర్ ఏజెంట్, ఆఫ్టర్ ఏజెంట్‌లా ఉంటుంది. థియేటర్‌లో ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం. సాక్షి వైద్యకు మంచి భవిష్యత్ ఉంటుంది’ అంటూ వివరించాడు.

Also Read:

‘ఏజెంట్’ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది: డినో మోరియా


Next Story

Most Viewed