చిరంజీవితో ఆ సీన్ చేసి అద్దంలో నన్ను నేను చూసుకుని చాలా తిట్టుకున్నాను.. జ్యోతి వైరల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-16 10:19:59  IST  )

తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌లోనూ నటించింది నటి జ్యోతి(Jyothi).

చిరంజీవితో ఆ  సీన్ చేసి అద్దంలో నన్ను నేను చూసుకుని చాలా తిట్టుకున్నాను.. జ్యోతి వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌లోనూ నటించింది నటి జ్యోతి(Jyothi). అలాగే బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. పలు చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించి తన అందాలతో యూత్‌లో బాగానే క్రేజ్ రాబట్టుకుంది. మరీ ముఖ్యంగా స్టా్ర్ హీరోలతో పలు సీన్స్ కారణంగా ఎంతో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

చాలా రోజుల తర్వాత జ్యోతి జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ టాక్‌ షోలో పాల్గొని తన కెరీర్‌లో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేసుకుంది. ఇక ఇందులో చిరంజీవి(Chiranjeevi)తో ఓ సీన్ చేసి తనను తానే తిట్టుకున్నట్లు కూడా చెప్పడం గమనార్హం. ఈ హీరోతో యాక్ట్ చేయలేకపోయానే అని ఫీల్ అయిన విషయం ఏదైనా ఉందా అని వర్ష అడగ్గా.. దానికి జ్యోతి సమాధానం చెప్తూ.. ‘‘చిరంజీవి గారితో ఓ సీన్ ఉంది చేస్తారా అని కాల్ వచ్చేసరికి వెంటనే ఒప్పుకున్నాను. అందులోనూ చిరంజీవి గారి కాంబినేషన్ ఒక్కటే సీన్ అన్నారు.

సరే అని వెళ్ళా. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పెళ్లి చూపులు సీన్. నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసి ఎవరో బండోడిని లవ్ చేస్తాను అంట. ఆ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసి ఇంటికొచ్చాకా అద్దం ముందు నన్ను నేను చూసుకుని తూ చాలా తిట్టుకున్నా. నేను చిరంజీవి ని రిజెక్ట్ చేసానా అనిపించింది. చిరంజీవి ని పక్కన పెట్టుకొని ఎవరో బండోడ్ని లవ్ చేయడం ఏంట్రా అనుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి రిజెక్ట్ చేసినందుకు చాలా బాధపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి

READ MORE ....

‘స్పిరిట్’తో స్టార్ వారసుల ఎంట్రీ ఫిక్స్.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న సందీప్ రెడ్డి వంగా.. !

Next Story