మియా ఖలీఫాను మిస్ అవుతున్నారా? ఆమె అందాలు ఆస్వాదించాలంటే ‘బిగ్ బాస్’ చూసేయండి..

by Disha Web Desk 10 |
మియా ఖలీఫాను మిస్ అవుతున్నారా? ఆమె అందాలు ఆస్వాదించాలంటే ‘బిగ్ బాస్’ చూసేయండి..
X

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్2 జూన్ 17 నుంచి జియో సినిమాలో ప్రీమియర్ కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ షోకు సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హౌస్‌లోకి రాబోతున్న కంటెస్టెంట్ల లిస్ట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సిమా తపారియా, మహీప్ కపూర్, పూనమ్ పాండే వంటి వ్యక్తులు షోలోకి ప్రవేశిస్తారని పలు నివేదికలు వెల్లడించాయి. ఇదిలావుంటే.. ఈ సీజన్‌ను మరింత హైలెట్ చేసేందుకు మరొక పోర్న్ స్టార్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ఈ సీజన్‌లో పోటీకి దిగబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా నెటిజన్లను ఆశ్చర్యపరిచేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తుండగా.. ఇక రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్.

Read more : ఆమె నాకు పుట్టలేదు.. చెత్త కుండీ దగ్గర దొరికితే పెంచుకున్నా: మిథున్


Next Story