- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న అడివి శేష్.. గ్రేట్ మ్యాన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
అడివి శేష్(adivi sesh) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఒక్క పోస్ట్‌తో నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.

దిశ, సినిమా: అడివి శేష్(adivi sesh) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఒక్క పోస్ట్‌తో నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. 26/11దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలిశారు. ఆయన మరణించిన తర్వాత తానే వారికి కొడుకులా ఉంటానని మాటిచ్చిన ఆయన ప్రతి ఏడాది నవంబర్ 26న వారిని కలుసుకుంటూ ఆత్మీయంగా వారితో మాట్లాడి సమయం గడుపుతున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన నటించిన ‘మేజర్’ సినిమానే అని సమాచారం. సందీప్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ మూవీ అడివి శేష్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇక ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఆయన సందీప్ తల్లిదండ్రులను కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు.
అంతేకాకుండా పలు కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘‘మేజర్ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోకూడదని అనుకున్నా. మా అమ్మ, అంకుల్‌కు కూడా ఇదే ప్రమాణం చేశా. నేను ఏ సినిమా చేస్తున్నా సరే ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో అనుబంధం కొనసాగిస్తూనే ఉంటా. వీరితో నేను ఉంటున్నానంటే మేజర్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్నట్లే. మన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకూడదు’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సూపర్ అన్నా, గ్రేట్ మ్యాన్, నీపై రెస్పెక్ట్ మరింత పెరింగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. అడివి శేష్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం అడివి శేష్, షానీల్‌డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ (dacoit)చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమాతో పాటు అడివి శేష్ ‘గూఢచారి-2’ చేస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగి నీడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. వామికా గబ్బి, మధు శాలిని, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ప్రకటించి చాలా రోజులే అవుతున్నప్పటికీ పూర్తి కానందున విడుదల నోచుకోలేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.






