శృతి హాసన్‌తో వివాదంపై స్పందించిన అడివి శేష్.. అందుకే ‘డెకాయిట్’ నుంచి తొలగించామంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-01 12:57:39  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(adivi sesh) చివరగా ‘హిట్-3’చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

శృతి హాసన్‌తో వివాదంపై స్పందించిన అడివి శేష్..  అందుకే ‘డెకాయిట్’ నుంచి తొలగించామంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(adivi sesh) చివరగా ‘హిట్-3’చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘డెకాయిట్’(Dacoit). ఈ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహిస్తు ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ముందుగా శృతి హాసన్‌(Shruti Haasan)ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

అంతేకాకుండా సగం షూటింగ్ అయ్యాక అడివిశేష్‌తో ఏదో గొడవ జరగడం వల్ల ‘డెకాయిట్’ నుంచి తొలగించినట్లు అప్పట్లో పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘శృతి హాసన్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉంది. అయితే మా మధ్య ఎలాంటి వివాదం లేదు. మేము స్నేహితులుగా ఉన్నాము. నాకు ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ ప్రాసెస్‌లో నాకు సింక్ అవ్వాలి. అందుకే శృతి హాసన్‌ను తొలగించాము. మృణాల్‌కు స్క్రిప్ట్ చెప్పడంతో.. ఆమె స్టోరీ వినగానే ఒప్పుకుంది. పది గంటలకు కథ చెప్పగానే మధ్యాహ్నం ఒంటిగంటకు ఒకే చేసింది.

‘సీతారామం’ మూవీలో మృణాల్ నటన చూసినప్పటి నుంచి ఆమె ఇష్టం ఏర్పడింది. అలాగే అందరిలాగా నెల సమయం తీసుకోకుండా.. అతి తక్కువ టైమ్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మేము అనౌన్స్‌మెంట్ వీడియోలో ఆమెను ముందుగా పరిచయం చేశాము. ఈ విషయంపై మృణాల్ సంతోషంగా ఉంది. డెకాయిట్‌ను ఇద్దరు హీరోల చిత్రంగా తీసుకురాబోతున్నాం. మృణాల్ పాత్ర ఇద్దరితో సమానంగా ఉండనుంది. ప్రస్తుతం మా సినిమా 60శాతం షూటింగ్ కూడా పూర్తైయింది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story