చైతన్య మాస్టర్ మృతిపై అదిరే అభి షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Disha Web Desk 7 |
చైతన్య మాస్టర్ మృతిపై అదిరే అభి షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధ తాళలేక సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో ‘‘ఢీ షో ద్వారా పేరు ప్రతిష్టలు వచ్చాయి కానీ డబ్బులు మాత్రం రాలేదు. జబర్దస్త్ లాంటి షో లకు మాత్రం ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి స్పందించారు.

ఈ మేరకు ‘‘ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇన్ఫిరేషన్‌గా తీసుకుని వస్తారు. అలా అని ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఆఫర్లు వస్తాయి.. డబ్బులు వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఆకలతో ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపితే తప్ప బ్రేక్ రాదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందే మానసికంగా అన్నిటికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా గట్టిగా నిలపడగలగాలి. మనల్ని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు డబ్బులు లేకపోతే ఇలాగే సూసైడ్ చేసుకోవాల అని అనుకునేలా ఉండకూడదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read...

పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే.. జనసేన నుంచి పోటీ చేస్తా



Next Story

Most Viewed