కొత్త సినిమా ప్రకటించిన అదా శర్మ.. దయలేని లేడీ డాన్‌గా కనిపించడంతో అంతా షాక్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అదా శర్మ(Adah Sharma) ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కొత్త సినిమా ప్రకటించిన అదా శర్మ..  దయలేని లేడీ డాన్‌గా కనిపించడంతో అంతా షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అదా శర్మ(Adah Sharma) ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో s/o సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కల్కి, గరం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ‘ది కేరళ స్టోరీతో’ రీఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది గత ఏడాది ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

‘హాతక్’ (Haatak)చిత్రంతో రాబోతున్నట్లు తెలుపుతూ.. పవర్ ఫుల్ లుక్‌తో కనిపించింది. విడుదలైన పోస్టర్‌లో ఫ్రీ హెయిర్‌తో క్యాప్ పెట్టుకుని.. సూటు, బూటు ధరించి.. చేతిలో గన్ పట్టుకుని ఆగ్రహంతో వెళుతున్నట్లు కనిపించింది. ఇక ఇందులో అదా శర్మ ఒక దోపిడీ అండ్ దయలేని లేడీ డాన్ శివరంజని ఆచార్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ శర్మ(Ajay Sharma) దర్శకత్వం వహిస్తుండగా.. 8 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది మీ అందరి ఆశీస్సులు కావాలంటూ పోస్ట్ పెట్టింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు కంగ్రాట్స్ చెబుతూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story