విష్ణుకాంత్ పై నటి సంయుక్త సంచలన ఆరోపణలు...

by Disha Web Desk 1 |
విష్ణుకాంత్ పై నటి సంయుక్త సంచలన ఆరోపణలు...
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న కోలీవుడ్‌ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు. నటి సంయుక్త విష్ణుకాంత్ పై సంచలన ఆరోపణలు చేసింది. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్‌ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ విష్ణుకాంత్ పెట్టిన ఆడియో వైరల్‌ అవడంతో సంయుక్తపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో తాను ఏ తప్పు చేయలేదని, విష్ణుకాంతే తనను అడల్ట్‌ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని ఆరోపించిది. తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడని చెప్పకొచ్చింది. బెడ్‌రూంలో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే దానిని తాను ఒప్పుకోలేదని తెలిపింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలాగా చూశాడని ఆరోపించింది. విష్ణుకాంత్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో అతనిపై సంయుక్త చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఆమె నిజాన్ని వక్రీకరిస్తోందని ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అసత్యాలను చెబుతోందని తెలిపాడు.

తన నిజ స్వభావాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఆమె నిందిస్తోందని అన్నారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె మాటలను నమ్మొద్దని విష్ణుకాంత్ ప్రజలను కోరాడు. తనను తాను రక్షించుకునేందుకే తన మీద లేని పోని నిందలు మోపుతోందని తెలిపాడు. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలని అని ప్రశ్నించాడు. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్‌ పెడితే మరి చూసేందుకు సంయుక్త ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: Raashi khanna: అద్దం ముందు నిలబడి డబుల్ అందాలతో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా


Next Story