డ్రగ్స్ కేసుపై స్పందించిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్.. ఏమన్నారంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-05 11:12:12  IST  )

టాలీవుడ్ నటి వరలక్ష్మీ శనత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

డ్రగ్స్ కేసుపై స్పందించిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్.. ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి వరలక్ష్మి శనత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అయితే వరలక్ష్మికి కూడా డ్రగ్స్‌తో సంబంధం ఉందని తనకు నోటీసులు అందాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా, ‘మాన్షన్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరలక్ష్మి డ్రగ్స్ కేసుపై స్పందించింది. ‘‘ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్ కాల్స్ రాలేదు. గతంలో నా వద్ద ఆదిలింగం అనే వ్యక్తి మేనేజర్‌గా వర్క్ చేశారు. సర్కార్‌తోపాటు ఆయన తీసుకువచ్చిన మూడు నాలుగు సినిమాల్లో నేను నటించా. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు ఏమి తెలియదు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆయన పేరుతో వార్తలు వచ్చాయి. దానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో నా ఫొటోని ఉపయోగించి ‘వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు వేస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చింది.

Next Story