‘పెద్ది’ సినిమాలో పవర్ ఫుల్ పాత్రకు ఎంపికైన నటి.. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-16 04:52:17  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషనల్ రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’(PEDDI).

‘పెద్ది’ సినిమాలో పవర్ ఫుల్ పాత్రకు ఎంపికైన నటి.. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషనల్ రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’(PEDDI). క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పెద్ది షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ మూవీకి సంబంధించిన షూట్ రీసెంట్‌గా బెంగళూరులో పూర్తి చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాలో మరో నటి యాడ్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్. పెద్దిలో పవర్ ఫుల్ పాత్ర కోసం తమిళ నటి విజి చంద్రశేఖర్‌ను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ‘అఖండ’లో బాలకృష్ణ తల్లిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఆమె ఇప్పుడు ‘పెద్ది’ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారు మరో బ్లాక్ బస్టర్ ఆమె ఖాతాలో పడటం ఖాయమని అంటున్నారు.

Next Story