14 ఏళ్ల కిందటి సమంత ఫోటో వైరల్.. ఫోటో షేర్ చేసింది అతడే..!

by Dishafeatures2 |
14 ఏళ్ల కిందటి సమంత ఫోటో వైరల్.. ఫోటో షేర్ చేసింది అతడే..!
X

దిశ, వెబ్ డెస్క్: సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు గడిచాయి. 2010లో ‘ఏ మాయ చేశావే’ మూవీతో సమంత తెరంగేట్రం చేసింది. ఆ మూవీలో తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యకు జోడీగా సమంత నటించింది. అయితే తాను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లే గడిచినప్పటికీ.. 14 ఏళ్ల కిందటి సమంత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూల రంగు డ్రెస్ లో ఓరచూపు చూస్తూ సమంత ఆ ఫోటోలో కనిపించింది. ఈ ఫోటోను ప్రముఖ యాక్టర్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘14 ఏళ్ల కిందట ఈ ఫోటోను మా బిల్డింగ్ పైన తీశాను. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు’’ అంటూ రాహుల్ రవీంద్రన్ కామెంట్ చేశాడు.

అంతకు ఒక్కరోజు ముందు ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత తన ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పింది. తన ఈ జర్నీలోని ప్రతి రోజు ప్రత్యేకమని, అందుకే తన జర్నీలోని ప్రతి ఒక్క రోజుకు థాంక్స్ అంటూ కామెంట్ పెట్టింది. కాగా సమంత నటించిన శాకుంతలం అనే పురణేతిహాస మూవీ ఏప్రిలో 14న విడుదల కానుంది.



Next Story