- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతని వల్ల నరకం అనుభవించా..నటి ప్రగతి సంచలనం !
అతని వల్ల నరకం అనుభవించానని ఓ దర్శకుడిపై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒక్కరు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆమె.. తల్లి, అత్త, వదిన లాంటి సహాయ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ముఖ్యంగా బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు.
కథ, పాత్ర నచ్చకపోతే అవకాశాలను వదులుకుంటా
నిత్యం జిమ్ కు వెళ్తున్న ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ లో కూడా పలు మెడల్స్ సంపాదించారు. అలాంటి నటి ప్రగతి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ కు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. ఒక దర్శకుడితో పనిచేసిన సమయంలో ఎదురైనా అనుభవం వల్ల.. తాను నరకం అనుభవించానని వెల్లడించారు.
ఇకపై అతనితో మళ్ళీ పని చేయబోనని నిర్ణయం తీసుకున్నట్లు నటి ప్రగతి చెప్పుకొచ్చారు. కథ, పాత్ర నచ్చకపోతే అవకాశాలను వదులుకుంటానని పేర్కొన్నారు. అలాగే డబ్బు కంటే మంచి పాత్రకే ప్రాధాన్యత ఇస్తానని క్లారిటీ ఇచ్చారు. సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్ పై కూడా దృష్టి పెట్టిన ఆమె.. ఫిట్ నెస్ తనకు ఎంతో ముఖ్యమని వివరించారు.






