- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రాజకీయ నాయకుడు నన్ను తన పక్కలోకి పిలుస్తున్నాడు.. మూడేళ్ల నుంచి వేధిస్తున్నాడంటూ నటి సంచలన పోస్ట్
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు వేధింపులకు గురవుతున్నట్లు తెలుపుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు వేధింపులకు గురవుతున్నట్లు తెలుపుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కొందరు ధైర్యంగా చెబుతుంటే మరికొందరు.. భయంతో సైలెంట్ బాధలు పడుతున్నారు. తాజాగా, ఓ మలయాళ నటి రీని ఆన్ జార్జ్ (Rini Ann George)తనను ఓ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడని సంచలన పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ‘‘నన్ను ఓ యువ రాజకీయ నాయకుడు తన పక్కలోకి రమ్మంటూ ఇబ్బంది పెడుతున్నాడు. పదే పదే మెసేజ్‌లు పెడుతూ నన్ను చాలా వేధిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఇది కొనాసాగుతూనే ఉంది. ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను.
అతడిపై ఆ పార్టీ సీనియర్లకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా నన్ను వేధిస్తున్నాడంటే.. ఉన్నత పదవులు ఇస్తున్నారు. సదరు నేత నన్ను మాత్రమే కాకుండా ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలను వేధించినట్లు నాకు తెలిసింది. మరో నటికి నాలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని నేను నిజాలు బయటపెడుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కానీ ఇందులో ఆ రాజకీయ నాయకుడి పేరును మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ కావడంతో డిలీట్ చేయడం గమనార్హం. అయినప్పటికీ ఆమె కామెంట్స్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.






