- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే ప్రియుడితో వరలక్ష్మి వ్రతం చేసిన నటి.. ఛీ..ఛీ ఇవేం పనులంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బుల్లితెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బుల్లితెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్, షోస్‌లో పాల్గొని తన పాపులారిటీని పెంచుకుంది. ఈక్రమంలోనే ఈ అమ్మడుకి బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో హౌస్‌మెట్‌గా ఇంట్లోకి వెళ్లింది. పలు టాస్క్‌లు ఆడినప్పటికీ విన్నర్ కాలేకపోయింది. కొద్ది వారాలకే ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి సీరియల్స్ చేయనప్పటికీ తన ప్రియుడు శివకుమార్(Shivakumar)తో కలిసి ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకుంది.
అతడితో కలిసి పలు వ్లాగ్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ట్రోల్స్‌కు గురవుతోంది. ఇక ఇటీవల ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి గ్రాండ్‌గా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఈ జంట ఈఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ పూజలో ప్రియాంక జైన్ తల్లి కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం పెళ్లి కాకుండానే ఇలా పూజలు చేయడానికి సిగ్గులేదా? అని తిడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






