స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్ పెట్టుకున్న మాజీ ప్రధాని మనవరాలు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్?

by Disha Web Desk 8 |
స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్ పెట్టుకున్న మాజీ ప్రధాని మనవరాలు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ రోజుల్లో ఈమె సినిమాల్లో ఉంది అంటే చాలు ఫ్యాన్స్ తెగ సంబర పడిపోయేవారు. తన కోసమే థియేటర్స్ వద్దకు వెళ్లేవారంట. తన నటన, అందంతో బాక్సాఫీస్ వద్ద రికార్ద్స్ క్రియేట్ చేసిన ఈ నటికి ఇప్పుడు 53 ఏళ్లు. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

ఈ నటి కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో చాలా మంది హీరోలతో ప్రేమాయణం నడిపించింది. హీరో వివేక్ ముష్రాన్, డీజే హుస్సేన్, నానా పటేకర్ ఇలా పలువురు హీరోలతో లవ్‌లో పడిన ఈ బ్యూటీ, నానా పటేకర్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుందంట. ఆమెకు ఆయనంటే చాలా ఇష్టం ఉండేదంట. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యిందని తెలియడంతో, ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. ఇక ఈ నటి వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని తన భర్తకు విడాకులిచ్చి, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఈ నటి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ.. హిరామండి వెబ్ సిరీస్‌లో నటించిన మనీషా తన నటనతో ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఈమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మనీషా నేపాల్ మాజీ ప్రధాని బిశేశ్వర్ ప్రసాద్ మనవరాలు, జయ ప్రకాష్ కొయిరాలా కూమార్తె.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed