మొగుడే నా శత్రువు అంటున్న హీరోయిన్.. పెళ్లైన ఆరు నెలలకు ఏం జరిగిదంటే?

by Disha Web Desk 8 |
మొగుడే నా శత్రువు అంటున్న హీరోయిన్.. పెళ్లైన ఆరు నెలలకు ఏం జరిగిదంటే?
X

దిశ, సినిమా : ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన, నటి మనీషా కొయిరాలా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ చాలా మంది సెలబ్రిటీలతో ఎఫైర్ నడిపించినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, చివరకు బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకొని అందరికీ షాకిచ్చింది. 2010లో పారివ్రామిక వేత్త సామ్రాట్ దహల్‌ను ఘనంగా వివాహం చేసుకొని, మనస్పర్థల కారణంగా పెళ్లైన ఆరు నెలలకే విడాకులు తీసుకొని విడిపోయింది.

కాగా, తాజాగా ఈ అమ్మడు తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నా భర్తే నాకు శత్రువు,అతనికి నాపై ఎప్పుడూ ప్రేమ లేదు, నాకు కూడా ఆయన అంటే ఇష్టం లేదు. పెళ్లైన ఆరు మాసాలకే నా భర్త నాకు శత్రువు అయ్యాడు, ఒక స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మనీషా కొయిరాలా కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Next Story

Most Viewed