సైజులు తగ్గించుకోమన్నారు.. నెటిజన్ల కామెంట్స్‌పై స్పందించిన నటి

by Web Desk |
సైజులు తగ్గించుకోమన్నారు.. నెటిజన్ల కామెంట్స్‌పై స్పందించిన నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్ మూవీ 'మిమి'లో గర్భవతిగా నటించిన 'కృతిసనన్' విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'ఆదిపురుష్' సినిమాలో సీతగా చాన్స్ కొట్టేసిన కృతి.. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్‌లో బాడీ షేమింగ్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మిమి'లో ప్రెగ్నెంట్ మహిళగా కనిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, కెరీర్ తొలినాళ్ల నుంచే తన అందంపై నెటిజన్ల సూటిపోటి మాటలు మనసును గాయపరిచాయని తెలిపింది.

'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే జనాల కళ్ళు నా పెదాలపై పడ్డాయి. సర్జరీతో పెదాల ఆకృతి సరిచేసుకోమని సూచించారు. ఆ తర్వాత నవ్వితే అస్సలు బాగుండనన్నారు. ముక్కు బాగోలేదన్నారు. నడుము సైజ్ తగ్గించుకోమని నానా రకాలుగా అవహేళన చేశారు' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇవన్నీ మార్చుకునేందుకు తాను ప్లాస్టిక్ బొమ్మను కాదన్న కృతి.. వాళ్ల కోరికలను ఇతరులపై రుద్దడం సరికాదని, ఎవరికైనా తమకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉందనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికింది.



Next Story

Most Viewed