66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ప్రముఖ నటి.. చర్చనీయాంశంగా మారిన వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-13 07:04:43  IST  )

66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్ వీడియోలు వైరల్.

66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ప్రముఖ నటి.. చర్చనీయాంశంగా మారిన వీడియో
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సెన్సేషన్ క్రియేట్ చేసే సీనియర్ నటి నీనా గుప్తా, ఈసారి ఒక వింతైన పుకారుతో వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ విందుకు ఐవరీ కలర్ చీరలో ఎంతో హుందాగా హాజరైన ఆమెను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ చీరలో పొట్ట కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో.. అది 'బేబీ బంప్' ఏమో అని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇక 66 ఏళ్ల వయసులో నీనా గుప్తా ప్రెగ్నెంట్ అంటూ రకరకాల మీమ్స్, వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు తమకు తోచినట్లుగా చర్చలు మొదలుపెట్టారు. ఈ పుకార్లు కాస్తా ముదరడంతో నీనా గుప్తా స్పందించక తప్పలేదు. తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు.

తాను గర్భవతిని కాదని ఆమె స్పష్టం చేశారు. "నేను గర్భవతిని కాదు. నేను కట్టుకున్న ఆ ఐవరీ చీర క్లాత్ చాలా మందంగా ఉంది. దానివల్ల ఆ కట్టులో నేను కాస్త లావుగా కనిపించాను అంతే. అది చూసి ప్రెగ్నెంట్ అనుకోవడం విడ్డూరంగా ఉంది" అంటూ గట్టిగానే బదులిచ్చారు. ఆ ఊహాగానాలు తనకు బాధ కలిగించడానికి బదులుగా వినోదభరితంగా అనిపించాయని నటి అనడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది "ఈ వయసులో నేను గర్భం దాల్చినట్లు వస్తున్న ఊహాగానాలన్నీ నాకు చాలా ఇష్టం. ఇది మనం ఒక దేశంగా అభివృద్ధి చెందుతున్నామని చూపిస్తుంది’’ అని తెలిపింది. తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలను నీనా గుప్తా ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొంటారు. గతంలో కూడా ఆమె తన జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను నిర్భయంగా పంచుకున్నారు. ఈసారి కూడా కేవలం ఒక చీర కట్టు వల్ల వచ్చిన పొరపాటును నెటిజన్లు అంత పెద్ద ఇష్యూ చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి ఈ 'బేబీ బంప్' చర్చకు ఎట్టకేలకు చెక్ పడింది.

Next Story