దసరా పండుగ సంప్రదాయంపై నటి వివాదాస్పద ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-03 14:41:46  IST  )

బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్ (Simi Garewal)దసరా పండుగ సాంప్రాదాయంపై వివాదాస్పద ట్వీట్ చేసింది.

దసరా పండుగ సంప్రదాయంపై నటి వివాదాస్పద ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్ (Simi Garewal)దసరా పండుగ సాంప్రాదాయంపై వివాదాస్పద ట్వీట్ చేసింది. రావణుడి రాక్షసుడు కాదు.. ఆయన బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని..ఓ పోస్ట్ పెట్టి చిక్కుల్లో పడింది. ‘‘ప్రతి ఏడాది దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రాణుడును కొంటెగా ఉన్నాడే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. ఏ తప్పు చేయలేదు.. అయినప్పుడు కాల్చడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు.

ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవ మర్యాదలతో పోలిస్తే అప్పట్లో రావణుడు ఒక స్త్రీని ఎంతో గౌరవించాడు. ఆమెకు తిండి పెట్టడంతో పాటు ఆశ్రయం కల్పించారు. తన భద్రత కోసం మహిళలను కూడా నియమించారు. పార్లమెంట్‌లో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా రావణుడు ఎక్కువ చదువుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మను కాల్చడం నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో కొద్ది గంటల్లోనే సిమి ఈ ట్వీట్ డిలీట్ చేసింది. అయినప్పటికీ కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Next Story