నటి ఆకాంక్ష దుబే.. పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు

by Disha Web Desk 6 |
నటి ఆకాంక్ష దుబే.. పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మార్చి 26న ప్రముఖ భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో హోటల్ గదిలో చనిపోయే ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సూపర్ స్టార్ పవన్ సింగ్‌తో కలిసి నటించిన సాంగ్‌ను షేర్ చేసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. తాజాగా, ఆకాంక్ష పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్‌ను వైద్యులు గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. దీంతో ఆకాంక్ష దూబే కేసు కొత్త మలుపు తిరిగింది.

Next Story

Most Viewed