- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో నటీనటుల ప్రమేయం ఉండదు.. చిత్ర నిర్మాతలే జాగ్రత్త పడాలంటూ శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్
స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కొన్ని చిత్రాలు బోల్తా పడుతున్నాయి.

దిశ, సినిమా: స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కొన్ని చిత్రాలు బోల్తా పడుతున్నాయి. ఇక ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ’ (coolie)మూవీతో పోటీగా ‘వార్-2’(war-2) కూడా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతుండటంపై శృతి హాసన్(Shruti Haasan) ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘నేను నటించిన సినిమాలు ఇతర స్టార్ హీరో చిత్రాలతో విడుదల కావడం ఇది తొలిసారి కాదు. ఎన్నో సార్లు అలా జరిగింది. కొన్ని మూవీస్ అనుకున్న సమయానికి విడుదలవ్వాలి. గతంలో నేను నటించిన ‘సలార్’ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ‘డంకీ’తో పాటు రిలీజ్ అయింది. రెండు ఒకేరోజు విడుదలైనప్పటికీ దేని ప్రత్యకత దానికి ఉంటుంది. రిలీజ్ విషయంలో నటీనటులు ఏం చేయలేరు. నిర్మాతలే ఒక సినిమాకు మరో మూవీకి మధ్య సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలీ, వార్-2 రెండింటి కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ రెండింటినీ చూసేందుకు వారికి సమయం ఇవ్వాలి కదా. కానీ రెండు చిత్రాలు ఓకేసారి రిలీజ్ చేస్తున్నారు. లోకేష్ సినిమాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కూలీని కూడా అదే స్థాయిలో తెరకెక్కించారు. చాలా భిన్నమైన కథతో రాబోతుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






