- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడి బర్త్ డే స్పెషల్.. విషెస్ తెలుపుతూ ‘డ్యూడ్’ మూవీ టీమ్ పోస్ట్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ కావడంతో పాటు ప్రదీప్ రంగనాథన్ పాపులారిటీని పెంచింది. ఈ యంగ్ హీరో వరుస ఆఫర్లు అందుకుంటూ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’(Dude). కీర్తి శ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఆయన పుట్టిన రోజు కావడంతో విషెస్ తెలుపుతూ ఫొటోను షేర్ చేశారు. ఇందులో హృదు హరూన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అయితే హీరోకు ఫ్రెండ్‌గా నటిస్తున్నాడా లేక మరేదైనా పాత్రలో కనిపించనున్నాడా? అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






