- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Taraka Ratna Health update: అత్యంత విషమంగా తారకరత్న హెల్త్ కండీషన్.. బెంగళూరు బయలుదేరిన బాలకృష్ణ!
Taraka Ratna Health update: అత్యంత విషమంగా తారకరత్న హెల్త్ కండీషన్.. బెంగళూరు బయలుదేరిన బాలకృష్ణ!
టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురి అయిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురి అయిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఏపీ నుండి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. గత 22 రెండు రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తారకరతక్న హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉండటంతో బాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరుకి బయలుదేరారు. మరి కాసేపట్లో తారకరత్న చికిత్స పొందుతున్న నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వారు చేరుకోనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.
Next Story






