సామాజిక సేవలోనే నిజమైన సంతృప్తి: సోనుసూద్

by Disha Web Desk 19 |
సామాజిక సేవలోనే నిజమైన సంతృప్తి: సోనుసూద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో సినీ నటుడు సోనూసూద్ సందడి చేశాడు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన కాటేజులు, భోజన శాల, యోగా ప్రాంగణాన్ని బుధవారం సోనూసూద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం వద్ద సంపంగి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంకల్పాన్ని, హరీష్ రావు పని తీరును అభినందించారు. సోనుసూద్‌‌తో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఆయూష్ కమీషనర్ ప్రశాంతి, నేచర్ క్యూర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే, కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, ప్రముఖులు సోనుసూద్‌తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ కార్యక్రమం అనంతరం సోనుసూద్ కాచిగూడలో నిర్వహించిన వీబీజీఎఫ్ కార్యక్రమంలో పాల్గొని లోగో ఆవిష్కరించారు. సోనుసూద్ మాట్లాడుతూ.. సామాజిక సేవలో నిజమైన సంతృప్తి ఉంటుందని, విబిజిఎఫ్ అందిస్తున్న సేవల్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషణ్ చైర్మన్ మడిపడిగ రాజు, సత్యవతి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed